చూడకుండానే సంతకాలు చేసేందుకు మరో వీరావకాశమా ?

కొద్ది రోజుల క్రితమే ఓ మంత్రి వర్యుడు జైల్లోకి వెళ్ళగానే, అన్ని ఫైళ్ళ మీదా తమ ముఖ్యమంత్రి చెప్పినందునే సంతకం చేసేడుట గానీ అతనికి ఆ విషయం లో ఏ ప్రమేయం గానీ స్వతంత్రత గానీ లేదని నొక్కి వక్కాణించేడు .
తద్వారా తప్పు ఒప్పులు ఆ ముఖ్య మంత్రివేగాని తనవి కాదు కనుక చట్టం క్షమించాలని వారి అభిప్రాయం అయివుంటుంది !
ఇప్పుడు రోజులు మారేయి . జైళ్ళ తలుపులు బయటకి వెళ్ళేందుకు బార్లా తెరవబడ్డాయి !
అధికారం జైల్లో పెట్టటానికి చూపెట్టిన తప్పులన్నీ ఒప్పులు అనుకుందని గ్రహించిన పెద్దలు ఇప్పుడా తప్పులని తాము సాధించిన ఘనత కింద పరిగణిస్తున్నట్లుగా వుంది .

ఆ మాజీ మంత్రివరేణ్యులు సదరు నిరంకుశ నేత వారసత్వపు పార్టీలో చేరి మాజీ బాస్ కి తన బానిసత్వం మరోమారు నిరూపించుకోవాలని చూస్తున్నారని నీలి వార్త !
కొడుకు అధికారం కోసం ఒక తల్లి ఆరాటం , ఓ తండ్రి పదవి కోసం ఒక కొడుకు ఆత్రం భారత దేశంలో విలువలని ఎంత త్వరగా పతనం చెయ్యగలవో కదా అని చాలా మది విస్తు పోతునట్లుగా వార్త !

Advertisements
Posted in వర్తమానం | Leave a comment

రెండు కళ్ళ పున్నెం

చెవులు వినిపించని పార్లమెంట్ సభ్యులు కల వాళ్ళం మనం  ఎంత అదృష్టం చేసుకున్నామో ?

ఏమీ మాట్లాడని బాబు ది రెండు కళ్ళ సిద్ధాంతం అని నిర్ణయించిన కాంగ్రెస్ ఎంపీ గారికీ వట్టి ‘ మాట్లాదినది సమైక్యాంధ్రా కోసం అనీ వాళ్ళ పార్టీ వాడే పక్కనే మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి తో విభేదించి రెండో సిద్ధంతం ప్రతిపాదించాడనీ , దానితో మొత్తంగా కాంగ్రెసు రెండు కళ్ళ సిద్ధాంతం మీద పేటెంట్ రైట్ తీసుకుందనీ తెలుసుకునేందుకు ఏమీ వినపడలేదు !!

అహా ఎటువంటి పున్నెమో కదా!!

Posted in టుమ్రీ ప్రలాపం, వర్తమానం | Leave a comment

కేటీఆర్ కొంచెం హుషార్ !

అహా ఏమి సుదినం !
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు !!
తారక రాముడు కూడా ఎదుగుతున్నాడు వాళ్ళ నాన్న లాగనే !
అవసరానికి తగ్గట్టు ప్లేట్ ఫిరాయించటంలో , ఇష్టం వచ్చినట్లు మాట్లాడతం లోనూ .
చంద్ర బాబు మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడని నాన్న గారు వా…తే ఇతగాడు అతి సంస్కారంతో తెలుగు ప్రజలకి బాబు అన్యాయం చేస్తున్నాడని వాపోయాడు !
ఆ కుటుంబానికి తెలుగు ప్రజలు అనే నైతికమైన హక్కు ఎక్కడ నుండి వచ్చింది ?
తెలుగు తల్లి అన్నమాటే కిట్టని వాళ్ళకి తెలుగు ప్రజలు అనే హక్కు ఎక్కడిది !
వాళ్ళు కేవలం తెలంగాణా ప్రజలు అనే అనాలి !
బాబు తెలంగాణా వద్దు అనీ అనలేదు . సమైక్య ఆంధ్రా మాత్రమే కావాలనీ అనలేదు .
నిజానికి తెలుగు ప్రజలందరికీ న్యాయం చెయ్యాలని అడుగుతున్న ఏకైక పార్టీ బాబుదే .
అలాంటివాడు తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తున్నట్లు, తెలుగు వారందరికీ కేటీఆర్ గారే వకాలతా పుచ్చుకున్నట్లూ మాట్లాడటం వింతల్లో కెల్లా వింత కాదూ ?
ఇవన్నీ ఎవరి పనుపున ఆ తండ్రీ కొడుకులిద్దరూ మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోని తెలుగువాడు ( రెండు వైపులా కలిపే ) ఎవరు ?

పలికెడిది భాగవతమట , పలికించెడివాడు……

Posted in వర్తమానం | Leave a comment

రెండు కళ్ళ వ్యాఖ్య- బొత్స స్టైల్

ఎవరైతే అర్ధంలేని వ్యాఖ్యానాలు సంజాయిషీలు చెప్పి ప్రజలు వాటిని ఒప్పుకుని తీరాలని శాసించే వికటాగ్రేసరులో వారే శ్రీ శ్రీ బొత్స గారు !
ఇదేదో పోకిరి డైలాగుని కాపీ కొట్టి బావుకుందామని కాదు .
బొత్స గారి మాటల తీరు ఇదివరలో మోపిదేవి గారి రాజీనామా సందర్భలో మాట్లాడుకున్నాము!

అలాంటివి తరచూ కాదు కాదు ఎప్పుడూ వారు మాట్లాడుతూనే వుంటారు. అందుచేతనే పునరావృత భయంతో మళ్ళీ ఎప్పుడూ ఆ విషయం ప్రస్తావించ లేదు .
అయితే మనం వారి తెలివితేటలనీ మేథా సంపత్తినీ గమనించి , గుర్తించి గౌరవించవలసిన ఎత్తుకు వారిప్పుడు ఎదిగేరు కనుక మళ్ళీ మనము ఇప్పుడు వారి గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఏర్పడింది !
శ్రీ వారి ఉవాచ :
‘ సీ డబ్లు సీ నిర్ణయానికి కట్టుబడి వుంటూనే ఎవరి ప్రాంత ప్రజల అభిప్రాయాలని వారు వ్యక్తపరిచేరు ! ‘
పైదాన్నుంచి రెండు సందేహాలు కలుగుతాయి బుర్రవున్న ఎవడికైనా .
1) పార్టీ అభిప్రాయాలను నివేదించటానికి పిలిచేరా కాంగ్రెసుని లేక పార్టీ పంపిన ‘కోన్ కిస్కా గాళ్ళ ‘ పొంతలేని ప్రలాపాలని వినటానికా ?

విభజనలో విధివిధానాల గురించి చెప్పమంటే ఎవరి అభిప్రాయాలని వారు చెప్పటానికేనా షిండే గారు ముందు ఒక్కరే అని ఆ తరువాత ఇద్దరిని అని సవరించుకున్నది ?
ఇప్పుడు కాంగ్రెసు పార్టీగా చెప్పినదేమిటి ?
మంత్రుల మంది ఈ విషయాన్ని ప్రజలకి తెలియచెయ్యాలి !
2) సీ డబ్లు సీ నిర్ణయానికి కట్టుబడి వుంటూనే అంటే అర్ధం ఏమిటి ?

విభజనకి కాంగ్రెసు అనుకూలం అనేనా? దానినే మంత్రుల మంది కి చెప్పినట్లు అనుకోవాలా ?
మరి అలాంటప్పుడు ప్రాంతాల ప్రజాభిప్రాయాన్ని చెప్పేరనటంలో వైరుధ్యం గురించి బొత్స వారి బుర్రకి తట్టదా ? లేక మంత్రుల మందిలో వారుకూడా అంత మంద మతులేనని వారి ప్రగాఢమైన విశ్వాసమా ?
అదీ కాకపోతే ప్రజలు అంత చెవిలో పూలు పెట్టుకుని కూర్చున్నారని వారి అంచనానా ?

ఇంత ఐ క్యు శూన్యమైన మనిషిని పీసీసీ అద్యక్షుడి గా నియమించిన కాంగ్రెసు అధిష్టానం తెలుగు ప్రజల తెలివి తేటలని ఎలా అంచనా వేస్తోంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న !!

Posted in వర్తమానం | Leave a comment

రెండు కళ్ళ సిద్ధాంతం- లేదా- బుర్ర దొబ్బింది

రెండు కళ్ళ సిద్ధాంతం – ఇది చాలా పకడ్బందీగా పథకం ప్రకారం తెలుగు దేశం , కాదంటే , చంద్రబాబు నాయుడు మీద చల్లిన బురద !
కాంగ్రెస్ , తెరాస కలసికట్టుగా పాడిన డ్యూయెట్ !!
వాళ్ళ కాపీ రైట్ ట్యూన్ !!!
అఖిల పక్షం అంటే చాలు కాంగ్రెస్ అదే పని చేసినా తె దే పా మీదే పాడే తెరాస కి ఆ మెలొడీ అంటే చాలు ఒళ్ళు మరచిపోతుంది .
మళ్ళీ అఖిల పక్షం ! అహా ఏమి చాన్స్ !
కేసేఅర్ గారికి ఫారం హవుస్ వదిలి బయటకు రావాలన్న కోరికి అమితంగా పొంగి పొరలింది .
ఇంతటి అవకాశం చేజార్చుకునే మూర్ఖుడా వారు ?
ఎన్నాళ్ళో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది .

కాంగ్రెస్ మళ్ళీ ఇద్దరిని పంపింది . ఇద్దరూ పరస్పర భిన్నమైన నివేదికలు ఇచ్చారు .
పార్టీలు ఇద్దరిని పంపించవచ్చు అన్నది కాని ‘ మంత్రుల మంది ‘, రెండు విభిన్నమైన వాదనలు కాని నివేదికలు ఇవ్వటం కానీ చెయవచ్చన్నది ఎప్పుడో ఎవరికీ అర్ధం కాదు !
కానీ కాంగ్రెసు చేసి చూపించింది !
దీన్ని రెండు కళ్ళ సిద్ధాంతం అనాలో రెండు నాలుకల సిద్ధాంతం అనాలో రెండు ముఖాల సిద్ధాంతం అనాలో కేసీఆర్ గారు చెప్పలేదు .
అంటే వారికి అది కనపడదు . వారి బుర్రకి అర్ధం కాదు కామోసు !
లేదా అఖిల పక్షానికి హాజరు కాని తెదేపా నిర్ణయంతో ఏమయిందో గాని శ్రీ వారు ‘ చంద్ర బాబుకు బుర్ర దొబ్బింది ‘ అని చాలా సంస్కారయుతంగా సెలవిచ్చి వారి సంస్కారాన్ని బయటపెట్టుకుని అభాసు పాలయ్యారు !
విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసేసుకున్నతరువాత , చంద్ర బాబు అభిప్రాయం చెప్పినా చెప్పకపోయినా తెరాసకి వచ్చిన నష్టం ఏమిటిట ?
కేసీఆర్ గారు వారి పక్ష పాత బుద్ధిని, కుళ్ళు తనాన్ని, నేలబారు రాజకీయాన్ని ప్రదర్శించుకుని వారేమిటో ప్రజలకి మరోమారు గీతోపదేశం చేసేరు !
హేట్స్ ఆఫ్ క చ రా గారూ !!
దొరతనానికి ఉదాహరణ అయిన నిజాం గారిని ప్రశంసించిన మీ’ బాంచను దొరా ‘ మనస్తత్వానికి మరో అధునిక రూపం ‘బాంచను దొర సానీ ‘ అన్నది ముసుగులో చూపిస్తున్నారు !!

Posted in వర్తమానం | Leave a comment

అఖిల పక్షం మెగా సీరియల్

అయ్యవారు ఏంచేస్తున్నారు అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు !
ఇది ఒక ఆశా జీవి అలోచనా విధానం అనవచ్చు. అయ్యవారికి తప్పు దిద్దు కుందాము అన్న దృక్పధం వుంది అన్న నమ్మకం అన్నమాట .
చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసే అయ్యవారినేమనాలి ?
సింపుల్ !
కాంగ్రెస్ ! కాంగ్రెస్ (ఐ) !! ఐ.ఎన్.సి !!!
మళ్ళీ అఖిల పక్షం !!!!
ఇప్పటికి రెండు అయ్యాయి .
ఏం సాధించేయి .
కన్ ఫ్యూజన్ ని మరింత పెంచేందుకు కాంగ్రెస్ కి తోడ్పడ్డాయి అన్న్న మాట వాస్తవం .   ఆ గందరగోళంలో ఇతరులని బలి చేసి తాను బయటపడటానికి కాంగ్రెస్ అవిరళ కృషి చేసింది . కొంత విజయవంతం అయిందని కూడా చెప్పాలి .  
చర్చలేమీ లేని అఖిల పక్షాలు ఎందుకు ? 
మేక మెడ క్రింది తిత్తులు తప్ప .
కేవలం పార్టీల దగ్గరనుండి కాగితాలు తీసుకోవటమే లక్ష్యమైతే వారిని పొస్ట్ చెయ్యమంటే సరిపోతుంది కదా?
మహ రాజావారికి కానుకలలాగా సమక్షంలోనే సమర్పించాలా ?
ఇతరులని ఎమోషనల్ గా ఇరకాటంలో పెట్టి రాము అనలేని పరిస్థితి కలిగించి చర్చల్లేని అఖిల పక్షం నిర్వహించటం  కాంగ్రెస్ కనిపెట్టిన కొత్తరకం రామ బాణం ! 

ఇప్పటికిప్పుడు ( వార్తా మాధ్యమాలు సరిగ్గా రిపోర్ట్ చేస్తుంటే  )    గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ విధి విధానాలపైన పార్టీలు అభిప్రాయాలు చెప్పాలిట ,  ఆ తరువాతే అఖిల పక్షం ట !  
ప్రభుత్వం  మంత్రుల మందకి విధివిధానాలు చెప్పకుండానే  ఏర్పరిచిందా? 
లేక మళ్ళీ ఇక్కడ కూడా గురువు గారి సామెతేనా !!
ఈ మాటు కూడా చర్చలు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన పార్టీలన్నీ రాము అని తెగేసి చెప్పాలి .
ముందు ప్రభుత్వం ఆ తరువాత పెద్దన్న (!) కాంగ్రెస్ మాట్లాడిన తరువాతే మిగతా వారు నోరు తెరవాలి. 
వాళ్ళు అసలు ఈ విభజన ఏ విధివిధానాల మీద ప్రకటించేరో ముందుగా తేట తెల్లం చేసి మిగతావారిని మాట్లాడమంటేనే  పారదర్శకత స్పష్టమౌతుంది .  
ప్రజలకీ నమ్మకం కలుగుతుంది . లేకపోతే ఆంధ్రా ప్రజలు వీటిని నమ్మరు !

కేవలం కన్సుల్ట్ చేసేము, కంకరెన్స్ తీసుకున్నాము, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే చేసేం లాంటి పడికట్టు పదప్రయోగాల కోసమే ఈ అఖిల పక్షం అయితే…

తప్పుల అయ్యవారికి శతకోటి వందనాలు !!!
 
 

Posted in వర్తమానం | 2 Comments

డ్రీం మర్చెంట్స్ లేక కలల రాజు – జగజ్జంత్రీ

“నాకు ఒక చక్కటి బంగారం లాంటి కల వచ్చింది రాత్రి” అన్నాడు మా శంకరం ఆసక్తి కరమైన కథకి నాందిగా. మేమెవ్వరమూ మాట్లాడలేదు. కానియ్యి అన్నట్లుగా తల వూపేను నేను. కాఫీ కొచెం తాగి కప్పు సాసర్లో పెట్టి మళ్ళీ అందుకున్నాడు శంకరం. వాడి మాటల్లోనే వినండి:

విశాఖపట్నంలో తయారైన వోల్క్స్ వాగన్ కారులొ గుంటూరులో  ప్రొద్దున్నే బయలు దేరి దారిలో వా న్ పిక్ అభివృద్ధి పరచిన తీరప్రాంతాన్ని సగర్వంగా చూస్తూ ఒంగోలు విమానశ్రయానికి చేరుకుని అక్కడనించి విమానంలో కడప వెళ్ళేను. అక్కడ స్టీల్స్ కర్మాగారంలో పనిచేస్తున్న పాతికవేలమంది వుద్యోగులను ఉద్దేశించి ఒక అరగంట ప్రసంగించి మళ్ళీ అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా నాలెడ్జ్ హబ్ మీదుగా కర్ణాటకా ఎల్లల వరకూ అభివృద్ధి చెందిన పరిశ్రమలనీ రతనాల సీమనీ ఆనందంగా తిలకిస్తూ బెంగుళూరు చేరుకుని విమానం ఎక్కి   నిజామాబాద్ చేరుకున్నాను. సమయాభావంచేత రేణిగుంట వెళ్ళి అక్కడ బి హెచ్ ఇ ఎల్ సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన భారీ కర్మాగరం లక్ష టన్నుల ఉత్పత్తి సాధనని లాంఛనంగా డేశానికి అంకితంచేసే ఉత్సవంలో పాల్గొన లేకపోయానన్న విచారం నన్ను ఒకింత బాధించిన మాట వాస్తవం.
మర్నాడు కారులో బయలుదేరి రోడ్డు ప్రయాణం చేస్తూ ఫాబ్ సిటీ, హార్డ్ వేర్ పార్కు, అప్పరేల్ పార్కు, ఐటీ పార్కు మొదలైన పారిశ్రామిక ప్రాంతాలమీదుగా వెళ్ళి మధ్యలో కారు దిగి సర్దా కోసం మెట్రో రైలు మీద హైదరాబాద్ లోని ముఖ్యమైన స్థలాలు  విహరించి ఇంటికి చేరుకున్నాను.

ఇంటిదగ్గర నా కోసం చాలామంది రైతు మిత్రులు వచ్చి కాచుకుని వున్నారు. వాళ్ళల్లో యెక్కువ భాగం పోలవరం, ప్రాణహిత, పులిచింతల, హంద్రీ-నీవా వగైరా ప్రాజెక్టుల కాలవలక్రింద వ్యవసాయం చేస్తూ కోట్లకి పడగలెత్తిన వాళ్ళు. వాళ్ళే కాకుండా పావలా వడ్డీతో, మరి ఇతర  పథకాలతో లక్షాధికారులైన అనేకానేక మహిళలూ వున్నారు.

ఈ ప్రయాణంలో ఎక్కడా ఏ పల్లెలోను  నేను అనారోగ్యంతో వున్న తెల్ల రేషన్ కార్డు వాళ్ళను చూడ లేదు. ఫ్లోరైడ్ తో బాధపడుతున్న వాళ్ళనీ  చూడలేదు.

ఎక్కడ చూచినా దేవుడి పాలనే అనిపించింది.

మెలకువ వచ్చినా మచం మీదనుండి లేవ బుద్ధి పుట్టలేదు
–ముగించేడు మా శంకరం.

మిత్రుడు మస్తాన్ పగలబడి నవ్వేడు.

నవ్వి అన్నాడు సీరియస్ గా :

” ఇదీ ఇన్నేళ్ళ చరిత్ర గల ఆంధ్ర ప్రదేశ్ సాధించిన ప్రగతి .
ఇన్నేళ్ళూ కలసి ఉండి మనం ఎక్కిన అందలం .
విడిపోయమా పాతాళానికి పడిపోతామని మనకి లేని భూతాన్ని చూపిస్తారు మన నాయక శేఖరులూ వారి వారసులూనూ . ఎందుకంటే ఆ భూతాన్నీ సృష్టించింది వారే కనుక !
నిజానికి వారి తురుపు ముక్క అదే కనుక !!
కనుక శంకరం ఇప్పటికైనా  కలలు కనటం మానేసి నిజంలో బ్రతకటం మొదలు పెట్టు.
లేదూ ఆ పగటి కలల్లోనే బ్రతుకుతానంటావా లే…
నేను సైతం వెర్రిగొంతుక… అంటూ శంఖారావణుడవు కా !!!   “

Posted in వర్తమానం | Leave a comment

నాన్నమ్మ , నాన్న.. ఒక బుల్లబ్బాయి కథ

భారత దేశం తత్వవేత్తలకీ, దార్శనికులకీ, జ్యోతిష పండితులకీ పేరుగాంచిన సంపన్న దేశం అని విన్నాను కానీ రాజకీయ నాయకులు దెశ భవిష్యత్తు గురించి కాక వారి ఆయుష్ గురించీ, మరణ విధానానం గురిచి  కూడా ముందే చూసి చెప్ప గలరని శ్రీ శ్రీ రా.గాం గారిని చూసి తెలుసుకున్నాను !
రాజకీయ జెనెటికల్ ఇంజినీరింగ్ లో డాక్టరేట్ తీసుకున్నట్టు వున్నారు వారు !!
(దుష్ట సమాసానికి క్షమించాలి. ఇటాలియన్- ఆఫ్  ద ఈస్ట్  లో పూర్తిగా వ్రాయలేక పోయేను )
అంత స్పష్టంగా భవిష్యత్తుని వారు ఎలా చూడ గలిగేరు?
వర్తమానంలో జరిగే విషయాలే వారికి సరైన సమయంలో తెలియవే  భవిష్యత్తు అంత గా ఎలా చెప్పగలిగేరు ?
అదేంటి అంటారా ?
మర్చిపోయేరా ఇంతలోనే ?
ఎంపీగా వుంటూ, అదికూడా పవర్లో వున్న పార్టీ ఎంపీ, అంతేకాకుండా ఆ పార్టీకి ఉపాద్యక్షుడుగా వుంటూ, వారి పార్టీ వారిచే భవిష్యత్ ప్రధానమంత్రి అని ఊదర కొట్ట బడే   నాయకుడు అయివుండి, దేశ రాజకీయాలలో పెనుమార్పులు తెస్తుందనుకునే విషయంలో వారి ప్రభుత్వమే మంత్రి వర్గం ద్వారా పచ్చ జెండా వూపిన ఒకానొక ఆర్డినెన్స్ గురించి వారికి, రాష్ట్రపతికి ఆ ఆర్డినెన్స్ ఆమోదంకోసం వెళ్ళిన తరువాత మాత్రమే,తెలిసింది అంటే వర్తమాన విషయల మీద వారికి వున్న అవగాహన కానీ దేశం గురించి వారికి వున్నా అంకిత భావం కానీ తెలియటం  లేదూ ?
అంతవరకూ వారు వారి పంజరంలో కూర్చుని రాగాలు తీసుకుంటూ కూర్చున్నారని అనుకోవాలా లేక వారికి అవేవీ అర్ధం కావు అని అనుకోవాలా?
వారి మంత్రి వర్గమే క్లియర్ చేసి పంపిన కాగితాన్ని ఆయన పబ్లిక్ ప్లాట్ ఫారం మీద  నిలబడి  ‘ చింపెయ్యాలి ‘  అని వాక్రుచ్చితే అదేదో బ్రహ్మండమైన విప్లవాన్ని తెచ్చినట్లు  వాళ్ళ వారే వారిని పొగుడుకుని వారిని ఆకాశానికి ఎత్తేయటానిని ఆయన ఖండించక పోవటంతోనే రాగాం గారి అవగాహనా రాహిత్యానికి , రాచరికపు రాజకీయాలకి వారి అంకిత భావం తేట తెల్లం అవుతోంది .
సరే వర్తమానం గురించిన వారి అవగాహనా రాహిత్యం గురించి ప్రక్కన పెడితే భూత కాలాన్ని గురించి వారికి ఎంత తేలుసో మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు .
అసలే వారు భూత కాలంగురించి విపరీతంగా బధపడిపోయేరు !
ఇంతకీ ఏమిటా గతం ?
నానమ్మ హత్య చెయ్యబడింది !
నాన్న హత్య చెయ్యబడ్డాడు !
ఆమాత్రం తెలిస్తేనే మనం ఏం సూత్రీకరించగలం ?
రాగాం గారు మరి తను కూడా హత్యకి గురి అవుతానన్న నిర్ణయానికి ఎలా రాగలిగేరు ?

1)  శారీరక రుగ్మతల లాగే హత్యా మరణాలు కూడా వారసత్వంగా వస్తాయి అని ఆయన సూత్రమా? ఇది ఆయన పొలిటికల్ జెనెటికల్ సూత్రమా?
దీనితో వారేం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి ?
పై రెండు హత్యలు విపక్షాలు చేయించేయి కనుక తనకీ ఆ ప్రమాదం ఉందనా?
అది కాదు అని అందరికీ తెలుసు !
2)  కాకపోతే వారిద్దరినీ హత్య చేసిన శక్తి ఏదైతే వుందో అదే తననీ హత్యచేస్తుందను కోవాలంటే అది ఒకటి కాదు రెండు అన్న సంగతి యవత్తు ప్రపంచానికి తెలుసు బహుశా రాగాం గారికి తప్ప .
లేదు తెలుసు అంటే అదేమిటో ఆయన వివరంగా చెప్పవలసిన బాధ్యత , ఆయన దగ్గరున్న సాక్ష్యాలు, వివరాలు ప్రజలముందు ఉంచవలసిన బాధ్యతా ఆయన మీద ఉన్నాయి. లేకపోతే ప్రజల ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు .
3) పొరుగు దేశాల మూలంగా తనకి ఏమైనా ప్రమాదం ఉందంటే  నాయనమ్మకి నాన్నకి పొరుగు ‘దేశాల ‘మూలంగా ఏమీ జరగలేదు కనుక అదీ తప్పే.  తనకే ప్రత్యేకంగా ఉందంటే భారత దేశంలో అలాంటి  వారు 542 పైచిలుకున్నారు. తన ప్రత్యేకత ఏమిటిట ? శతకోటి లింగాల్లో ఓ .. లింగం అంతే కదా ?   తనకంటూ ఓ పదవి వుంటే తప్ప .
అంటే వారప్పుడే ప్రధాని అయిపోయినట్లు భావించి మాట్లాడటం మొదలు పెట్టేరా ?
హా హత విధీ !!!
4)  అసలింతకీ అయన రాజకీయలలో గానీ ప్రజా జీవితంలో గానీ చేసినది కానీ సాధించినది కానీ ఏమిటి ?
ఓ మనవడు , ఓ కొడుకు అవటమే అర్హత అయితే ప్రియాంకాకి కూడా అదే ప్రమాదం పొంచి వుండాలి కదా ? మరి ఆవిడ మాట్లాడదేమి ?
ఏతవాతా తేలుతున్నది ఏమిటంటే రాగాం గారు లేని దెయ్యాన్ని ఊహించుకుని మనకి చూపించే ప్రయత్నం చేసి సానుభూతి ఓట్లు సంపాదించి ( వాళ్ళ నాన్నలగా) పబ్బం గడుపుకోవాలని ఆశిస్తున్నారా?

విషయం పూర్తిగా తెలియకుండా ఏది తోస్తే అది మాట్లాడ్దటం ఆయన రాజకీయ పరిణతా?
అపరిపక్వతకి పరాకాష్టా ?
ప్రాణానికి భయం వంశపారపర్యంగా వస్తుందన్న అపోహ నుండి రాగాం గారు బయటపడాలంటే వకటే మార్గం :  అధికారం , పదవి వశపారంపర్యంగా రావాలని ఆశించటం మానేయ్యటమే !

Posted in వర్తమానం | Leave a comment

ఆంధ్రులకి ఇప్పుడు కావలసింది అర్ధంలేని సమైక్యత కాదు హక్కుల పరిరక్షణ, నష్ట నివారణ

ఏమన్నా అంటే అన్నామంటారు గానీ ఈ సమైక్య ఉద్యమ నాయకులు,  ఈ ఏపి ఎన్ జీ ఓ లు తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణా ఎన్ జీ ఓ లు సకలజనుల సమ్మెలో పాల్గొంటున్నప్పుడు ఏమయ్యారు ?
అశోక్ బాబు ఈ ప్రశ్నకి సమాధానం ఈ రాష్ట్రానికి చెప్పాలన్న బాధ్యతని గుర్తుంచుకోవాలి !  ప్రజలకి జవాబూ చెప్పాలి !!
వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది అని కేంద్రానికి ఏనాడు అయినా తెలియ చెప్పే ఉద్యం చేసేరా ?
అప్పుడు నిద్ర పోతున్నారా ?
తోటకూర నాడే చెపితే ఇంత దూరం వచ్చేది కాదన్న సామెత చెప్పినట్లు ఈ ఉద్యమం ఏదో అప్పుడే చేస్తే కొంతైనా ఉపయోగపడేదేమో కదా?
తెలంగాణా వాళ్ళు ఉద్యమం చేస్తే మనదేం  పోతుందిలే అన్న నిర్లక్ష్యం  , ‘ మన (వి) నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చెయ్యగలరన్న ‘ అపోహ  లేదా అర్ధం లేని ధీమాతో విర్రవీగేరా ?
మన అధికార ఎం ఎల్ ఏలు , ఎం పీ లు , కేంద్ర రాష్ట్ర మంత్రుల నైతికత , నిజాయితీ , సత్తా  ఏమిటో ఇప్పటికైనా ప్రజలు గమనించి వుంటారని భావిస్తున్నాము .

సమైక్యం అంటూ మాట్లాడే ఈ ఉద్యమ నాయకులు గానీ సామాన్యుడు గానీ ఏ ఒక్కడైనా సమైక్యంలో తెలంగాణా ప్రజలు కూడా ఉంటారనీ వారి సమస్యలకి   విభజన కాకుండా వేరే పరిష్కారాన్ని సూచించే   బాధ్యత సమైక్య వాదుల పై ఉంటుందని అలోచించేరా? ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేసేరా  ??
వాళ్ళ సమస్యలని  పట్టించుకోనిది సమైక్యం ఎందుకు అవుతుంది ?
మరి ఇలాంటి ఉద్యమంతో కేంద్రానికీ మిగతా యావత్తు భారత దేశానికి వెళ్ళే సంకేతం ఎలా వుంటుంది ?
సమస్య మూలాన్నే సరీగా అర్ధం చేసుకోకుండా చేసే ఉద్యమాన్ని ఏమంటారు ? దాని వలన ఫలితం ఏమిటి ?

ఇదేమీ మాట్లాడకుండా నీతులు వల్లించే నిరహార దానయ్యలతో చెడు జరుగుతుందే కాని ఉద్యమానికి మంచి జరగదు .

ఈ రాజకీయ నాయకులనెవరినీ నమ్మకుండా వుండటం ఎంతైనా మంచిది !
ఉద్యమంలోకి అప్పుడే విధ్వంసం ప్రవేశించింది !
అంటే ముసుగులేసుకున్న రాజకీయ నాయకులు ప్రవేశించారని అర్ధం .
ఉద్యమం తగలబడి పోవటానికి ఇక ఆట్టే సమయం పట్టదు .
ఆ అవకాశం వారికి పూర్తిగా ఇచ్చే బదులు స్వఛ్ఛందంగా ప్రజలే సమైక్య ఉద్యమానికి స్వస్తి చెప్పి సమస్యా పరిష్కార ఉద్యమానికి నాంది చెప్పటం , తద్వారా జరిగే నష్టాన్ని నివారించుకుని కావలసినవి సాధించుకోవటం మంచిది !

పొరాడి సాధించుకోండి  :

హైదరాబాదు  లో ఈ నాడున్న వారికీ వారి పిల్లలకీ ప్రాంతీయత అధికారాలు.
హైదరాబాదు లో  రాబడిలో న్యాయ సమ్మతమైన వాటా నిర్ధిష్ట కాలం పాటు .
నీరు , విద్యుత్, సాంస్కృతిక సంస్థలలో   వగైరాలలో  భాగం ,
ఇన్నాళ్ళూ అంధ్ర ప్రాంత సంపద కూడా పెట్టుబడిగా హైదరాబాదు లో , ఇతర తెలంగాణా జిల్లాల్లో (వుంటే కనుక )  నెలకొల్పిన అనేకానేక సంస్థలలో  చారిత్రిక, సాంస్కృతిక, ఆర్ధిక సంపదల తరలింపు.
కేంద్రం నుండి కొత్త రాజధానికి , మౌలిక సదుపాయాలకి ,  ఐ టి , కమ్యూనికేషన్ రంగాలో ప్రాధమిక ప్రోత్సాహకాలు , గుంటూరు బెజవాడ మధ్య అంతర్జాతీయ విమాన నిర్మాణానికి, పర్యాటకరంగంలో మౌలిక సదుపాయాలకి వలసిన ప్రొత్సాహకాలు వగైరా వగైరా  కార్యక్రమాలకి  కావలసిన ఆర్ధిక సహాయం ,
ఆఖరిదీ ముఖ్యమైనదీ భద్రాచలం, మిగతా అలాంటి  ప్రాంతాల పునర్విలీనం,

ఇంకా ఇంకా మేధావులకి తెలిసినవెన్నో…..

Posted in వర్తమానం | 6 Comments

సమైక్యం–కొన్ని భేతాళ ప్రశ్నలు

తీరాంధ్ర సీమ ప్రాంతాల సోదరులకి కొన్ని భేతాళ ప్రశ్నలు :
1)  శాసన సభ్యులూ పార్లమెంట్ సభ్యులూ రాజీనామా చేస్తే సమైక్య ఉద్యమానికి వచ్చిన లాభం ఏమిటి ?
వాళ్ళు చేసేమనే అంటారు . స్పీకరులు ఇంకా అంగీకారం తెలుప లేదంటూనే వుంటారు . దానితో అటు రాజ్యాంగం లోనూ ఇటు ప్రజల మధ్యా ఉండేందుకు   అవకాశం దొరుకుతుంది వారికి .  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాము అంటూ చెప్పే వాళ్ళు సరైన సమయం చూసి అటువైపు గెంతేసి ముఖంచాటెయ్యగలరు . నిండా ముంచెయ్య గలరు .
2)  వాళ్ళూ మామూలు ప్రజలే అయిన తరువాత ఆ రెండొందల మంది ఉద్యమంలోకి రాకపోతే నష్టం ఏమిటిట ?
వెనుకటి గుణమేల మాను.. అన్నట్లు వాళ్ళు ఉద్యమానికి వారిదైన రంగులు పూసి చెడ కొట్టనూ గలరు,  హై జాక్ చెయ్యనూ గలరు . ఆతరువాత హస్తం ఇవ్వనూ గలరు (చూ : జై తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్రా ఉద్యమం ) .
3)   ఏదో ఆర్డినెన్స్ ని చింపెయ్యమని రాహుల్ గాంధీ గారంటే చించేసినట్టు అఫ్ట్రాల్ కేబినెట్ నోటేగదా దీన్ని చించెయ్యలేరా అని   అతగాడెవరో రోడ్డు ప్రక్కన కూర్చున్న ఆసామీ అడిగితే జరుగుతుందా?
అక్కడ యువరాజా వారి కీర్తి ప్రతిష్టలు పెంచటం కోసం ఆమాట అనిపించేరు. ఇక్కడ అలా అంటే ఇన్నాళూ మాతృమూర్తి వేసుకుంటూ వచ్చిన పథంకం  కూలిపోయి పట్టాభిషేకానికి వున్న కొద్దిపాటి ఆశలూ హుళక్కి అయిపోతాయి . అంచేత  ఆ దారిన పోయే దానయ్య అన్నట్లు జరిగేందు అవకాశం వుందని అనుకుంటే షడ్యంత్రంలో చిక్కుకున్నట్లు కాదూ ?
4)  శాసన సభలో బిల్ ని  ఓడించి  ఆతరువాత రాజీనామా చేస్తామనే పెద్దలు ఎంత  కపట నాటకం ఆడుతున్నారో ఎంత నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారో అర్ధం కావటంలేదూ ?
బిల్ కేవలం సభ యొక్క అభిప్రాయాలు  తెలుసుకోవటానికి మాత్రమే తప్ప దానిని పాస్ చేసి తిరిగి ప్రెసిడెంట్ కి పంపమని కాదు దానిని రాష్ట్ర శాసన సభకి పంపేది.  అది కేవలం గౌరవం ఇచ్చినట్లేగాని అధికారం ఇచ్చినట్లు కాదు !  కాంగ్రెసు రాజకీయమైన పైచెయ్యి సాధించటానికి ఎత్తుగడలోనే  ఇది జరుగుతోంది కాని లేకపోతే రాజీనామాలకి  సభ్యులు ఇంత తాత్సారాం చెయ్యటం కానీ స్పీకర్ అంగీకరించటానికి మీన మేషాలు లెక్కించటంలో కాని ఆర్ధం ఏమిటి ?
5)   యజమానినే తిరగబడటానికి అనుమతి కోరినట్లు పళ్ళం రాజు గారు రాజీనామ కి ప్రధాన మంత్రి, పార్టీ అధిష్టానాన్ని అనుమతి కోరటం ఏమిటి ?
తిరిగి నియోజకవర్గంలో ఓటు అడగటానికి రావటానికి ఆయనకి ముఖం ఏలా చెల్లుతుంది ?  (చెవిలో మాట : రాజ్య సభ ప్రవేశ హామీ ప్రసాదించబడిందని  కర్ణ పిశాచి ఘోష )

6)  సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి తేల్చుకుంటాము  అని కూడా దారి పక్కన దానయ్య గారు సెలవిచ్చేరు .  ఇందులో పస ఉందా ?
దేనికోసం న్యాయస్థానానికి వెడతారు సామీ ?
ఎవరి చెవిలో పూలు పెడదామని మీ ఆలోచన ?
పంపకాలు వద్దని వెడితే ఏ న్యాయస్థానం  మీ కేసు తీసు కుంటుంది ?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఏ కొత్త రాష్ట్రాన్నైనా – ఏ రాష్ట్రాలని కలిపి అయినా , ఏ రాష్ట్రాలని విడగొట్టి అయినా , కొన్ని ప్రాంతాలని రాష్ట్రాలనుండి తీసుకుని అయినా  ఏర్పాటు చేసేందుకు అన్ని రాజ్యాంగ, న్యాయపరైన హక్కులూ కలిగి వుంది .    ఈ ప్రక్రియ మొత్తంలో రాష్ట్రం/రాష్ట్రాలు  యొక్క అభిప్రాయాలని తీసుకుంటారే తప్ప అంగీకారం కాదు . ( నిజానికి అలా అంగీకారం తీసు కోవాలనంటే కేంద్రం ఏ పనీ చెయ్య లేదు ) .
పంప కాలలో జరిగిన లోటుపాట్లు, అసమానతలు, అన్యాయాలు, హక్కుల భంగం వగైరాల విషయంలో అయితే న్యాయస్థానాలు విచారిస్తాయి న్యాయాన్ని  జరిగేలాగా తీర్పులు ఇస్తాయి .
చివరగా ఓ ప్రశ్న . ఇది ముఖ్యంగా దానయ్య గారికి :
60 శాతం వారు కోరుతున్నారు కనుక కోర్టు వారిమాట విని వారి పక్షాన తీర్పు చెప్పాలి అంటే మిగతా  40 శాతం వారికి ఎటువంటి ప్రాధమికమైన హక్కులూ లేవని   కోర్టు ఒప్పుకున్నట్లే కదా ! అది సాధ్యమా ?

ఇలాంటి పరిస్థితులలో న్యాయస్థానానికి వెడతామంటే   ఫేస్ సేవింగ్ కి అయినా అవ్వాలి లేదా ప్రజలని పక్క దోవ పట్టించి పబ్బం గడుపుకోవటానికి అయినా అయి వుండాలి .

ఈ రెంటిలో  నాయకులది ఏ త్రోవ దానయ్యది ఏ త్రోవ ??
అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని  రక్షించుకోండి !!

ఈ లోపల ఏ దానయ్య ఏది చెప్పినా….

Let devil quote the scriptures of Bible

Posted in వర్తమానం | 2 Comments